గురుకుల విద్యాలయాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు సబర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల పోస్టర్‌ను శనివారం కలెక్టర్ పి.రాజాబాబు ఆవిష్కరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 5వ తరగతి నుంచి జూనియర్ ఇంటర్ వరకు ప్రవేశాల దరఖాస్తుల ఆహ్వానంపై రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ జిల్లా కో ఆర్డినేటర్ జయ పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: వికసిత్ భారత్‌లో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ప్రిన్సిపాల్ ఎన్.నిర్మలమణి అన్నారు. ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు గారి ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయంలోని సెమినార్ హాల్‌లో ప్రధానమంత్రి మోదీ మంత్రా కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోని విద్యార్థినీ విద్యార్థులు దేశ చరిత్రను అవగాహన చేసుకోవాలని, సీ్త్ర సాధికారతను సాధించుకోవాలన్నారు. విద్యార్థులు ప్రొఫెషనల్ స్కూల్స్ లో లైఫ్ స్కిల్స్‌లో ప్రాధాన్యత పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
మార్కాపురం: ఎడ్లపందేల బరిలో బరువైన బండను లాగుతూ గుండెపోటుతో ఎద్దు మృతిచెందిన ఘటన మార్కాపురం జిల్లా తర్లుపాడులో శనివారం జరిగింది. గ్రామంలోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీల్లో శనివారం నంద్యాల జిల్లా అలగనూరు గ్రామానికి చెందిన కట్టిబడి రోలి అనే రైతు ఎడ్ల జతలో ఒక ఎద్దు బండలాగుతూ గుండెపోటుతో మృతి చెందింది. సుమారు 800 అడుగులు లాగిన ఎడ్లజతలో ఒక ఎద్దు కుప్పకూలి తుది శ్వాస విడవడంతో ఉత్సవాల్లో విషాదం నెలకొంది. రైతులు కంటతడి పెట్టారు. ఎద్దు మృతదేహాన్ని గ్రామంలో ఊరేగించారు. గ్రామస్తులు చందాలు వేసుకుని సుమారు రూ.2.50 లక్షలను ఎడ్ల యజమాని రోలికి అందజేశారు.
గురుకుల విద్యాలయాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ


