తిరుమల లడ్డూపై ఇంత దుర్మార్గమా..! | - | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూపై ఇంత దుర్మార్గమా..!

Feb 1 2026 3:09 AM | Updated on Feb 1 2026 3:09 AM

తిరుమ

తిరుమల లడ్డూపై ఇంత దుర్మార్గమా..!

ఒంగోలు సబర్బన్‌: కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి మీద ఇంతటి దుష్ప్రచారమా.. తిరుమల లడ్డూ విషయంలో ఇంతటి దుర్మార్గమా.. స్వార్థ రాజకీయాల కోసం భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేయడం ఎంత వరకు సబబని వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు, న్యాయవాది నగరికంటి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. కూటమి పార్టీల నేతలు చేస్తున్న అసత్య ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలో తిరుమల లడ్డూ విషయంలో విషం చిమ్ముతూ వేసిన ఫ్లెక్సీలపై ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఆయన నిరసన వ్యక్తం చేశారు. పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు, ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి కమిషనర్‌ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుమల లడ్డూలో ఎలాంటి పశువుల కొవ్వు కలవలేదని సీబీఐ నివేదిక ఇచ్చినా ప్రజల్లో అపోహలు కల్పించటానికి, దేవదేవుని భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు ఫ్లెక్సీలు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తిరుమల లడ్డూ విషయంలో అసత్య ప్రచారం చేస్తూ శ్రీమహా పాపం నిజం.. అసలు అది నెయ్యే కాదు.. పామాయిల్‌, కెమికల్‌ వాడిన ద్రవం.. జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన ఘీ (అంటే నెయ్యి), ఆ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూ ప్రసాదాల తయారీశ్రీ... అని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కూటమి పార్టీల నాయకులు దేవదేవుడి ప్రసాదాన్ని వీధిన పడేయటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. లడ్డూ విషయాన్ని వివాదాస్పదం చేయటానికి ఇంతకు తెగిస్తారా అని మండిపడ్డారు. ఈ నాయకులకు దేవుడన్నా భయం లేదని, ఎందుకంటే వాళ్ల అనుకూల మీడియా ఉంటే చాలన్న బరితెగింపుతో దుర్మార్గాలు చేస్తున్నారని మండిపడ్డారు. కమిషనర్‌ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన అనంతరం అసిస్టెంట్‌ కమిషనర్‌కు వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.

తిరుమల లడ్డూపై విషప్రచారం

చేస్తూ ఒంగోలులో కూటమి పార్టీల నాయకులు

ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

ఆరోపణలు అవాస్తవమని సీబీఐ నివేదిక ఇచ్చినా కూటమి పార్టీల నేతల తీరు మారదు

కల్తీ పేరుతో ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్న కూటమి పార్టీల నేతలు

దేవుడన్న విచక్షణ కూడా లేకుండా మీడియాను అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలు

వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు ధ్వజం

టీడీపీ కూటమి నాయకులు వేసిన ఫ్లెక్సీలు తీసేయాలంటూ ఒంగోలు నగర కమిషనర్‌కు వినతిపత్రం

తిరుమల లడ్డూపై ఇంత దుర్మార్గమా..! 1
1/1

తిరుమల లడ్డూపై ఇంత దుర్మార్గమా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement