ఘనంగా జిల్లా ఆవిర్భావ దినోత్సవం
ఒంగోలు సిటీ: జిల్లా 57వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు జిల్లాలోని కందుకూరును, కర్నూలు జిల్లాలోని మార్కాపురంను, గుంటూరు జిల్లాలోని ఒంగోలును కలిసి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహాగౌడ్, వైఎస్సార్ సీపీ నాయకులు గౌతమ్ అశోక్, పార్టీ సంయుక్త కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, దేవరపల్లి అంజిరెడ్డి, రామసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


