విష ప్రచారం ఆపండి
ఒంగోలు టౌన్: కల్తీ లడ్డు పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ వైఎస్సార్ సీపీ నాయకులు మున్సిపల్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలులో అపరిచితులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు సోమవారం వన్‌టౌన్, తాలుకా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఆయన వెంట నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఉన్నారు.


