ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
● మార్కాపురం జిల్లా గౌడ ఉద్యోగుల
సంక్షేమ సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గౌడ్
మార్కాపురం టౌన్: గౌడ సంఘ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు కే వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. మార్కాపురం జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీ సమావేశం ఆదివారం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద ఉన్న కల్యాణ మండపంలో ఇల్లూరి రంగస్వామి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని గౌడ ఉద్యోగుల అభివృద్ధి కోసం, సంఘం పటిష్టత కోసం నిరంతరం పాటుపాడాలని కోరారు. గౌడ భవనం నిర్మాణం కోసం 51 సెంట్ల స్థలాన్ని సేకరించామని, భవన నిర్మాణానికి అందరూ కృషిచేయాలన్నారు. నూతన కమిటీ అధ్యక్షునిగా వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వరరావు గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు గౌడ్, కోశాధికారిగా పోలయ్య గౌడ్, సహాయ కార్యదర్శిగా శ్రీనివాసులు, చెన్నయ్య, ఉపాధ్యక్షులుగా లక్ష్మీ ప్రసన్న, వెంకటేశ్వర్లు గౌడ్, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో దర్శి, ప్రకాశం జిల్లా నాయకులు గురవయ్య గౌడ్, టీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


