గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
ఒంగోలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి నివాళులు
ఒంగోలు సిటీ: జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మాగాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అహింసను ఆయుధంగా చేసుకొని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వై.వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, వైఎస్సార్ సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, గల్లా దుర్గ, దేవరపల్లి అంజిరెడ్డి, సయ్యద్ అప్సర్, పల్నాటి వెంకటేశ్వర రెడ్డి, చందోలు చెంచి రెడ్డి, పాలడుగు శ్రీనివాస రావు, వెంకయ్య నాయుడు, షైక్ మీరావళి, మధు, యెహన్, గుత్తి కొండ నారపు రెడ్డి, పీటర్, తోటపల్లి రవి, మారుతీ, అమర్, ఖాదర్ బాషా, సాయి చందు, నాయకులు పాల్గొన్నారు.


