డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పరీక్ష వాయిదా | - | Sakshi
Sakshi News home page

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పరీక్ష వాయిదా

Feb 13 2026 5:25 AM | Updated on Feb 13 2026 5:25 AM

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పరీక్ష వాయిదా

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పరీక్ష వాయిదా

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పరీక్ష వాయిదా ముదిరాజ్‌ విభాగం జిల్లా అధ్యక్షునిగా సురేష్‌ ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు పీఆర్‌సీ కమిషన్‌ నియమించాలి

ఒంగోలు: జిల్లాలోని న్యాయసేవాధికార సంస్థలో ఖాళీలకు సంబంధించి ఈ నెల 15వ తేదీ నిర్వహించనున్న పరీక్షలలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పరీక్షను వాయిదా వేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర రెండు పరీక్షలు స్థానిక ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో యథావిధిగా 15వ తేదీనే జరుగుతాయని చెప్పారు. వాయిదా వేసిన పరీక్ష నిర్వహించే తేదీని తదుపరి ఆదేశాల మేరకు ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఒంగోలు టౌన్‌: వైఎస్సార్‌ సీపీ ముదిరాజ్‌ విభాగం జిల్లా అధ్యక్షునిగా పులుసు సురేష్‌బాబును నియమిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. తనపై నమ్మకంతో ముదిరాజ్‌ విభాగం జిల్లా అధ్యక్షునిగా నియమించిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సహకరించిన జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబుకు సురేష్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ట్రాఫిక్‌పై ఎస్పీ హర్షవర్థన్‌రాజు

పెద్దదోర్నాల: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివెళ్తున్న నేపథ్యంలో పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వరకు ఉన్న ఘాట్‌ రోడ్డులో ఎటువంటి ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్థన్‌రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు, హైవే పెట్రోలింగ్‌ వాహనాలు, టోయింగ్‌ వెహికల్స్‌ను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం కంట్రోల్‌ రూంల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు. ఘాట్‌రోడ్డులో అనుభవం ఉన్న డ్రైవర్లే వాహనాలు నడపాలని ఎస్పీ కోరారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించరాదని, డ్రోన్‌ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రద్దీ సమయాల్లో అదనపు పోలీసు సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. భారీ వాహనాల రాకపోకలను నియంత్రించి ప్రమాదాలను నివారించేందుకు హెచ్చరిక బోర్డులు, సూచికలు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాద ప్రాంతాలలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఘాట్‌ రోడ్లలో వేగాన్ని, ఓవర్‌ టేకింగ్‌లను నియంత్రించాలని కోరారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని మహా శివరాత్రి వేడుకలను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం

ఒంగోలు టౌన్‌: గత ఎన్నికలలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ వెంటనే పీఆర్‌సీ కమిషన్‌ నియమించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.రవి డిమాండ్‌ చేశారు. పీఆర్‌సీ కమిషన్‌ను నియమించాలని కోరుతూ యూటీఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. గురువారం యూటీఎఫ్‌ నాయకులతో కలిసి కార్డులు పోస్టు చేశారు. అనంతరం రవి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల ఆర్థిక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 25 వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని, ఇంకా పీఆర్‌సీ కమిషన్‌ నియమించకుండా ప్రభుత్వం కాలపయాపన చేస్తోందని విమర్శించారు. ఐఆర్‌ 29 శాతం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, జెడ్‌పీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, గ్రాట్యుటీ బకాయిలు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు సకాలంలో చెల్లించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ హై, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement