ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు
వైఎస్సార్ సీపీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.
ఆకాశం పాక్షికంగా మేఘావృతమైఉంటుంది. చలిగాలులు వీస్తాయి. పొగమంచు కురుస్తుంది.
ఎరువుల ధరలు తగ్గించాలి
ఇప్పటికే దిగుబడులు రాక ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఎరువుల ధరలు పెంచడం వలన వ్యవసాయం చేయాలంటే భారంగా ఉంది. ప్రధానంగా వరి, పత్తి, మిర్చి సాగుకు అవసరమయ్యే ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం. పత్తి సాగు చేసినా వర్షాలు లేకపోవడంతో వాడుముఖం పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ధరలు పెంచడం రైతులకు భారమే.
– ఉడుముల కోటిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు
పంటలకు మద్దతు ధరలు లభించక కుదేలవుతున్న అన్నదాతలపై పెనుభారం పడనుంది. ఒక వైపు యూరియా లభించకపోవడం, మరో వైపు ఎరువులు ధరలు పెరగడంతో రైతుల నడ్డి విరుగుతోంది. ఎరువుల ధరలు పెరగడంతో ఉమ్మడి జిల్లాలోని రైతులపై కోట్లాది రూపాయల భారం పడనుంది. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక వ్యవసాయం కష్టతరంగా మారింది.
పెరిగిన ఎరువుల ధరలు అన్నదాతపై మోయలేని భారాన్ని మోపుతోంది. వివిధ కంపెనీలకు చెందిన ఎరువులు బస్తాకు సుమారు రూ.150 నుంచి రూ.200 వరకు పెరిగాయి. గత ఏడాది మిర్చి, పత్తి, పొగాకు సాగు చేసిన రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధరలు లేకపోవటంతో నష్టపోయారు. టన్నుకు 20 బస్తాలు లెక్కగా వ్యవసాయాధికారులు లెక్కిస్తారు. రబీలో మొత్తం ఎరువుల వినియోగం 1,26,060 మెట్రిక్ టన్నులు కాగా సగటున బస్తాకు రూ.150 ప్రకారం పెరిగిన ఎరువులు లెక్కిస్తే మొత్తం మీద సుమారు రూ.38 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. అప్పులు చేసి సాగుచేస్తే ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడంతో వ్యవసాయం చేయడం కష్టమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అప్పులు ఎక్కువై ఉమ్మడి జిల్లాలో పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఎరువు..ధరవు!
మార్కాపురం:
జిల్లాలో మొత్తం 5,31,369 మంది రైతులున్నారు. రబీ సీజన్‌కు సంబంధించి 86,982 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఒక వైపు యూరియా అందక అవస్థలు పడుతున్న రైతులకు పెరిగిన ఎరువుల ధరలు శాపంగా మారుతున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌లో మోంథా తుఫాన్ తాకిడికి మిర్చి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రబీలో పప్పుశనగ, మొక్కజొన్న, శనగ పంటలపై ఆశలు పెంచుకున్నారు. ఈ దశలో ఎరువులు ధరలు మోతమోగుతుండడం రైతులకు షాక్ ఇచ్చింది. గత ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచింది. నాలుగైదు నెలల వ్యవధిలోనే మరోసారి ధరలు పెంచిన ప్రభుత్వం రైతులను పొలాకు దూరం చేస్తోంది. పెరిగిన ఎరువుల ధరలు చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత క్రమంగా ఎరువుల ధరలు పెరుగుతుండడంతో సాగు చేయాలా ? వద్దా ? అన్న సందిగ్ధంలో పడిపోతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు అంటూ చెప్పుకుంటున్న నాయకులు కేంద్రం ధరలు పెంచితే నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రబీలో 86,982 హెక్టార్లలో సాగు..
ఉమ్మడి జిల్లాలో మొత్తం రబీ సీజన్‌లో 86,982 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 11,526 హెక్టార్లలో, జొన్న 2529 హెక్టార్లలో, మొక్కజొన్న 14,230 హెక్టార్లలో, శనగలు 19,430 హెక్టార్లలో సాగు చేశారు. ఈ సీజన్‌లో యూరియాతో పాటు ఎరువులు వినియోగం ఎక్కువగా ఉంటుంది. పెరిగిన ధరలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. గత సీజన్లలో గిట్టుబాటు ధరలు లభించక ఒక వైపు, ప్రకృతి వైపరీత్యాలు మరో వైపు కోలుకోలేకుండా చేశాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపడంతో రబీ సీజన్‌లోనైనా నష్టాన్ని పూడ్చుకుందామన్న వారి ఆశలపై ధరలు నీళ్లు జల్లాయి.
హెక్టారుకు రెండున్నర బస్తాల డీఏపీ వినియోగం..
28–28 రకం ఎరువులో యూరియా, భాస్వరం ఉంటాయి. వేర్లు ఏపుగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. 14–35–14 (నత్రజని, భాస్వరం, పొటాష్) ఎరువు, 20–20–20–0–13 రకం ఎరువులను ఎక్కువగా వరి, మిర్చి పంటలకు వినియోగిస్తారు. ఇందులో ప్రధానంగా నత్రజని మొక్క పెరుగుదలకు, భాస్వరం వేర్ల అభివృద్ధికి, పొటాష్ గింజ నాణ్యతకు, బరువు పెరుగుదలకు, పురుగులు, తెగుళ్లు తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. దీంతో కాంప్లెక్స్ ఎరువులను రైతులు కచ్చితంగా వాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పెరిగిన ఎరువుల ధరలు రైతులకు భారంగా మారనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ఎక్కువగా యూరియాను ఉపయోగిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 39,587 టన్నుల యూరియా జిల్లాకు రాగా సుమారు 38 వేల టన్నుల యూరియాను రైతులు వాడారు. మిగిలిన కాంప్లెక్స్ ఎరువులను కూడా వాడారు. యూరియా ధర ఒక్కటి మాత్రం బస్తా రూ.266 చొప్పున విక్రయిస్తున్నారు.
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


