ధ్వజ స్తంభం కూలి ఏడాదిన్నర..
ఆలయానికి గర్భగుడి ముఖమైతే ధ్వజ స్తంభం హృదయం లాంటిది. భక్తులు గుడిలోకి వెళ్లే ముందు ధ్వజ స్తంభానికి మొక్కడం ఆనవాయితీ. అయితే వెలుగొండ క్షేత్రంలో భక్తులు మొక్కేందుకు ధ్వజ స్తంభమే లేకపోవడం పాలకుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఆలయంలో సుమారు 20 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన ధ్వజ స్తంభం 2024 మే నెలలో భీకర గాలులకు ఒరిగి నేలవాలింది. ఈ దుర్ఘటన చోటుచేసుకుని 19 నెలలైనా ఇప్పటి వరకు నూతన ధ్వజ స్తంభం ఏర్పాటు చేయడంపై పాలకులు దృష్టి సారించలేదు. ప్రస్తుతం ఆలయ కమిటీ చైర్మన్, ధర్మకర్తలు ఉన్నారో లేదో కూడా తెలియడం లేదని భక్తులు పెదవి విరుస్తున్నారు.


