పొగాకు బ్యారెన్లు దగ్ధం
పామూరు: మండలంలోని చింతపాలెంలో రైతు కేతు రాధాకృష్ణారెడ్డికి చెందిన పొగాకు బ్యార్నీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పొగాకు క్యూరింగ్ జరుగుతున్న సమయంలో ఆకు మొద్దు గొట్టడంపై పడటంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో సుమారు రూ.5 లక్షలు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
మర్రిపూడి: మండలంలోని ధర్మవరంలో ఆదివారం పొగాకు బ్యారెన్ దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన మార్తాల నరసింహారెడ్డికి చెందిన పొగాకు బ్యారెన్‌లో దాదాపు 1350 పచ్చాకు కర్ర క్యూరింగ్ జరుగుతుండగా ఆకు మొద్దు గొట్టంపై పడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. కొండపి నుంచి అగ్ని మాపక సిబ్బంది వచ్చిసరికి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో 1350 అల్లుడు కర్ర, టైర్లు, గొట్టాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో రూ.3.50 లక్షల ఆస్తినష్టం సంభవించిందని బాధితుడు వాపోయాడు.
పొగాకు బ్యారెన్లు దగ్ధం


