విద్యుత్ షాక్‌తో ఫీడ్ బాయ్ మృతి
టంగుటూరు:
రొయ్యల చెరువులోని విద్యుత్ మోటారుకు మరమ్మతులు చేస్తుండగా షాక్ కొట్టి ఫీడ్ బాయ్ మృతిచెందిన సంఘటన మండలంలోని అనంతవరం పంచాయతీ పరిధి లోని తాళ్లపాలెంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు టంగుటూరు మండలం తాళ్లపాలెం గ్రామ సమీపంలో కొల్లూరి శ్రీను అనే వ్యక్తి రెండు సంవత్సరాల లీజుకు రొయ్యల చెరువు తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్నాడు. ఆ రొయ్యల చెరువుకు మరమ్మతులు చేసే క్రమంలో మోటారు పనిచేయలేదు. రొయ్య ల చెరువులకు ఫీడ్ బాయ్‌గా పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా ప్రతులను మండలం ఆనందపూర్ గ్రామానికి చెందిన రమేష్ మల్లిక్ (20) మోటారుకు ఉన్న కరెంటు వైర్లను కలుపుతుండగా ప్రమాదవశాత్తూ షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే కిందపడి రమేష్ మల్లిక్ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి అతన్ని తరలించారు. తాళ్లపాలెం గ్రామ వీఆర్‌ఓ కత్తి నరసింహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లేశ్వర రావు తెలిపారు.


