భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం వద్దు
● జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి
ఒంగోలు సబర్బన్: ఒంగోలు అర్బన్ డెవలెప్‌మెంట్ అధారిటీ పరిధిలో జరిగే భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం ఉండరాదని జాయింట్ కలెక్టర్, అర్బన్ డవలెప్‌మెంట్ వైస్ చైర్మన్ కల్పనా కుమారి ఆదేశించారు. ప్రకాశం భవన్‌లోని ఆమె ఛాంబర్‌లో బుధవారం అర్బన్ డవలప్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్, ఏపీడీపీఎంఎస్, ఇంజినీరింగ్ విభాగం, గ్రామ పంచాయతీలలోని భవన నిర్మాణాలకు ఇచ్చే అనుమతుల్లో పురోగతిపై జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ఆయా అంశాలపై ఆమె అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వలేటివారిపాలెం: మండలంలోని మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం తలనీలాలకు బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో రూ.2,30,150,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన కేవీఎన్ ఎంటర్‌ప్రైజర్స్ అధినేత కోటపాడు వెంకటనరసమ్మ హెచ్చు పాట పాడి దక్కించుకున్నట్లు తెలిపారు. పమిడపాడు గ్రూప్ టెంపుల్ ఈఓ యు శ్రీనివాసరావు ప్రత్యేకాధికారిగా కార్యక్రమం నిర్వహించారు. కార్యాక్రమంలో ఆలయ సిబ్బంది ప్రసాద్‌రావు, మధు, మోహన్‌రావు, మాల్యాద్రి, వంశీ, ఏఎస్సై బ్రహ్మయ్య, రాజు పాల్గొన్నారు.
భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం వద్దు


