బైకు ప్రమాదంలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

బైకు ప్రమాదంలో యువకుడు మృతి

Feb 7 2026 2:58 PM | Updated on Feb 7 2026 2:58 PM

బైకు ప్రమాదంలో  యువకుడు మృతి

బైకు ప్రమాదంలో యువకుడు మృతి

బైకు ప్రమాదంలో యువకుడు మృతి

లింగసముద్రం: మద్యం సేవించి మోటార్‌ సైకిల్‌పై వెళ్తూ అదుపుతప్పి కింద పడటంతో బొచ్చు వేణు (37) అనే యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన లింగసముద్రం మండలంలోని చినపవని ఎస్టీకాలనీ సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై జి.రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గుడ్లూరు మండలం గుండ్లపాలెం గ్రామానికి చెందిన బొచ్చు వేణు మద్యం సేవించి పూరేటిపల్లి మీదుగా చినపవని వైపు మోటార్‌ సైకిల్‌పై వేగంగా వెళ్తున్నాడు. ఎస్టీకాలనీ వద్ద అదుపుతప్పి కింద పడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్డం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement