ఆటో ఢీకొని యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని యువకుడు మృతి

Feb 7 2026 2:58 PM | Updated on Feb 9 2026 11:46 AM

-

ఆటో ఢీకొని యువకుడు దుర్మరణం

పామూరు: ముందు వెళ్తున్న బైకును వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొన్న ఘటనలో బైకుపై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. శుక్రవారం రాత్రి మండలంలోని వగ్గంపల్లె గ్రామ సమీపంలో 565వ నంబర్‌ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై కట్టా అనూక్‌ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని నిమ్మచెట్లపల్లె గ్రామానికి చెందిన రాగిపిండి గురునారాయణ (35) అనే వ్యక్తి బైకుపై వగ్గంపల్లె గ్రామం వైపు నుంచి స్వగ్రామం నిమ్మచెట్లపల్లెకు వెళ్తున్నాడు. అదే సమయంలో వగ్గంపల్లె వైపు నుంచి కనిగిరి వైపునకు వెళ్తున్న ఆటో అదుపుతప్పి ముందు వెళ్తున్న మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టింది. రోడ్డుపై పడిన గురునారాయణ తలకు గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement