వెలుగొండ క్షేత్రం అభివృద్ధికి చర్యలు
జేసీబీతో ముసి వాగును శుభ్రం చేస్తున్న దృశ్యం
వాగును పరిశీలిస్తున్న దేవదాయశాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి
● జిల్లా దేవదాయశాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి
కొనకనమిట్ల: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెలుగొండస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జిల్లా దేవదాయశాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆలయంలో మౌలిక వసతుల కల్పనను రెండేళ్లుగా గాలికొదిలేసిన వైనంపై ‘దేవదేవుడే ధ్వజమెత్తాలి’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. సోమవారం వెలుగొండ క్షేత్రం పరిసరాలను పరిశీలించారు. ఆలయ ఈఓ చెన్నకేశవరెడ్డి, అర్చకులు ప్రసాదాచార్యులుతో ఆలయ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ఆలయ పరిసరాలు శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో కురిసిన వర్షాలకు కూలిన ధ్వజ స్తంభం స్థానంలో మరొకటి ప్రతిష్టించేందుకు ఉభయదాతలైన గార్లదిన్నె గ్రామస్తులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. మార్చిలో బ్రహ్మోత్సవాల నాటికి మౌలిక వసతులు కల్పించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఆలయం పక్కన ఉన్న ముసి వాగులో పిచ్చి చెట్లను జేసీబీతో తొలగింపజేశారు.
వెలుగొండ క్షేత్రం అభివృద్ధికి చర్యలు
వెలుగొండ క్షేత్రం అభివృద్ధికి చర్యలు


