ఛలో పోతిరెడ్డిపాడు వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఛలో పోతిరెడ్డిపాడు వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

Feb 5 2026 7:20 AM | Updated on Feb 5 2026 7:20 AM

ఛలో పోతిరెడ్డిపాడు వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

ఛలో పోతిరెడ్డిపాడు వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

కనిగిరిరూరల్‌: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి కుమ్మకై ్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటూ రైతులకు, ప్రజలకు తాగు, సాగు నీరు లేకుండా దూరం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు, రాయలసీమకు జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి నిరసనగా ఈ నెల 5న ఉదయం 10 గంటలకు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డి పాడు వద్ద జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఛలో పోతిరెడ్డిపాడు వాల్‌పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దద్దాల నారాయణ యాదవ్‌ రెండు తెలుగు రాష్ట్రాల కుమ్మకై ్క రాజకీయాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఛలో పోతిరెడ్డి పాడు బహిరంగ సభకు 5వ తేదీ ఉదయం 7 గంటలకు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బయలు దేరనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎస్‌కే అబ్దుల్‌ గఫార్‌, జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, ఓకేరెడ్డి, జి.బొర్రారెడ్డి, కటికల వెంకట రత్నం, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, తమ్మినేని సుజాత, రామనబోయిన శ్రీను, పోలక సిద్ధారెడ్డి, డాక్టర్‌ ఆవుల కృష్ణారెడ్డి, డాక్టర్‌ రసూల్‌, ఆయిమల్ల నాగమణి, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కార్యదర్శులు దాదిరెడ్డి మాలకొండారెడ్డి, సంగటి మహేంద్రారెడ్డి, బత్తుల మాలీ, పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, బచ్చు వెంగళరావు, ఎస్‌కే రహీం బాషా, ఎస్‌కే ఖాశింవలి, ఎస్‌కే షరీఫ్‌, వై దేవరాజ్‌, మూలే రాజశేఖరరెడ్డి, కంటు గురవయ్య, పలుకూరి భాస్కర్‌, మూలే యోగిరెడ్డి, సంగు వెంకటేశ్వరరెడ్డి, కసిరెడ్డి రామసుబ్బారెడ్డి, గోడి నారాయణరెడ్డి, కన్నేటి సుబ్బారెడ్డి, యాళ్ల కృష్ణారెడ్డి, ఎస్‌కే షకీలా, మద్దిశెట్టి భారతీ, లక్ష్మీ, వేముల రేష్మా, శెట్టిపల్లి కొండయ్య, ఎస్‌కే రహిమాన్‌, ఎస్‌కే నాగూర్‌వలి, డబ్బుకొట్టు రవి, చిల్లా సాయి, దాసరి మాల్యాద్రి, దమ్ము వెంకటయ్య, మల్లెల యాకోబు, తాతపుడి నాని, గోనా జేమ్స్‌, ఏకుల వెంకట సుబ్బారెడ్డి, ఎస్‌కే షబ్బీర్‌, ఎస్‌కే ఖాదర్‌ జిలానీ, ఆండ్ర వెంకట్రావ్‌, జైపాల్‌, మోరా సుబ్బారెడ్డి, తిరుపతిరెడ్డి, తమ్మినేని కొండారెడ్డి, ఎస్‌కే రఫీ, దేవసాయం, ఎలిక శ్రీను, కాసుల బాల గురవయ్య, వేంపాటి మల్లికార్జున గంగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement