వాల్మీకి బోయల సమాధులు ధ్వంసం
కనిగిరి రూరల్:
రియల్ ఎస్టేట్ ముసుగులో ఉన్న కొందరు అధికార పార్టీ నేతలు రాత్రి రాత్రే వాల్మీకి బోయకులానికి చెందిన వారి సమాధులను తవ్వేసిన ఘటన శనివారం కనిగిరిలో వెలుగు చూసింది. బాధిత వాల్మీకి బోయల కథనం ప్రకారం.. కనిగిరి పుట్టిన నాటి నుంచి పాతూరు పక్కనే వాల్మీకి బోయపాలెం ఉంది. దీనికి సంబంధించి కొత్తూరు అభయాంజనేయ స్వామి గుడి ఎదురుగా (ప్రస్తుతం ఎన్‌హెచ్ 565) రోడ్డు పక్కన సర్వే నంబర్ 554లో వాల్మీకి బోయల సమాధుల తోట ఉంది. తాతముత్తాతల కాలం నుంచి సుమారు ఎకరా భూమిలో ఆ కులానికి చెందిన వారు చనిపోతే అక్కడ అంత్యక్రియలు చేస్తున్నారు. కొంతకాలంగా దీనిపై కన్నేసిన అధికార పార్టీ రియల్టర్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రస్తుతం సుమారు 50 సెంట్ల స్థలంలో ఉన్న సమాధుల కట్టడాలను పొక్లెయిన్‌లతో తొలగించి పక్కనే ఉన్న రాగి కుంటలో పడేశారు.
రూ.1.50 కోట్ల స్థలం పైకన్ను
వాస్తవానికి సర్వే నంబర్ 554లోని సుమారు 50 సెంట్ల స్థలంలో పూర్వీకుల కాలం నుంచి వాల్మీకి బోయల శ్మశానవాటికగా ఉంది. అందులోనే అంత్యక్రియలు పూర్తి చేసుకునే వారు. అందులోని కొద్ది స్థలంపై కోర్టులో వివాదం కూడా నడుస్తున్నట్లు సమాచారం. ఇటీవల అక్కడ హైవే పడటం.. భూములకు విలువ విపరీతంగా పెరగడం.. ప్రస్తుతం ఆ స్థలం విలువ సుమారు రూ.1.50 కోట్లు ఉండటంతో కొందరు రియల్టర్‌లు అధికార పార్టీ అండతో ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో విషయం తెలుసుకున్న వాల్మీకి బోయలు శనివారం నిరసనకు దిగారు. తమ సమాధులను దున్నేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.1.50 కోట్ల స్థలం కబ్జాకు యత్నం
ఆర్థిక, అంగ, రాజకీయ బలంతో దుశ్చర్య
వాల్మీకి బోయలు గగ్గోలు
వాల్మీకి బోయల సమాధులు ధ్వంసం
వాల్మీకి బోయల సమాధులు ధ్వంసం
వాల్మీకి బోయల సమాధులు ధ్వంసం


