కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం | - | Sakshi
Sakshi News home page

కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం

Feb 5 2026 7:18 AM | Updated on Feb 5 2026 7:18 AM

కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం

కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం

పార్టీకి గ్రామ కమిటీలు, కార్యకర్తలే మూలం వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

కొనకనమిట్ల: పార్టీకి గ్రామ కమిటీలు, కార్యకర్తలే మూలమని, వారే పార్టీని ముందుండి నడిపిస్తారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు స్పష్టం చేశారు. మండలంలోని ఇరసలగుండం, పాతపాడు, నాయుడుపేట గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన రచ్చబండ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అడ్డుకునేందుకు వెనకడుగు వేసేది లేదన్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అందరం ప్రజల్లోనే ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. గ్రామ కమిటీలు గ్రామాల్లో పటిష్టంగా ఉండాలని, కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ అనుబంధాల విభాగాల్లో పదవులు పొందిన నాయకులు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ ప్రజా ఉద్యమం చేపట్టిందని, దీనికి గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్నీ దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మార్కాపురంలో మెడికల్‌ కాళాశాల ఏర్పాటుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్‌ కళాశాలల ప్రెవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇరసలగుండం, పాతపాడు సర్పంచ్‌లు గోపిరెడ్డి ఓబులరెడ్డి, దొంతిరెడ్డి జయమ్మ చినరామిరెడ్డి, ఎంపీటీసీ కరేటి నాగలక్ష్మి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వైస్‌ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్‌, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు మోరా శంకర్‌రెడ్డి, యూత్‌ కన్వీనర్‌ గాడి కోనేటిరెడ్డి, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్‌ ఏలూరి సంజీవరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్‌ ఉడుముల కాశిరెడ్డి, పార్టీ అనుబంధ విభాగల సభ్యులు గోనుగుంట్ల శ్రీనివాసులు, నాగం ప్రసాద్‌, పసల చెన్నకేశవులు, ఉప్పుటూరి పెదవెంకటయ్య, గుంటక నారాయణ, కుందురు గురుస్వామిరెడ్డి, ఉన్నం శ్రీనివాసులు, తంగిరాల బ్రహ్మారెడ్డి, పోలసాని నారాయణరెడ్డి, సుబ్బారెడ్డి, చలమారెడ్డి, గోపిరెడ్డి మాధవరెడ్డి, దొంతిరెడ్డి చినరామిరెడ్డి, మోరబోయిన మాలకొండయ్య, దారకమల్లి వెంకటేశ్వర్లు, వాకా పెద్దిరెడ్డి, కోండ్రు వెంకటేశ్వర్లు, ఇమాంసా, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement