రూరల్‌ సీఐగా శేషగిరిరావు | - | Sakshi
Sakshi News home page

రూరల్‌ సీఐగా శేషగిరిరావు

Feb 5 2026 7:18 AM | Updated on Feb 5 2026 7:18 AM

రూరల్

రూరల్‌ సీఐగా శేషగిరిరావు

రూరల్‌ సీఐగా శేషగిరిరావు ● వీఆర్‌కు శ్రీకాంత్‌బాబు, నాగులప్పలపాడు ఎస్సై రజియా సుల్తానా సకాలంలో గుర్తిస్తే సులువుగా క్యాన్సర్‌ నయం ● డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు

● వీఆర్‌కు శ్రీకాంత్‌బాబు, నాగులప్పలపాడు ఎస్సై రజియా సుల్తానా

ఒంగోలు టౌన్‌: ఒంగోలు రూరల్‌ సీఐగా ముప్పలనేని శేషగిరిరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన వీఆర్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌బాబును వీఆర్‌కు బదిలీ చేశారు. శ్రీకాంత్‌ వ్యవహార శైలిపై ఐజీకి ఫిర్యాదుల నేపథ్యంలో ఆయనపై వీఆర్‌ వేటు పడినట్లు ప్రచారం సాగుతోంది. నాగులప్పలపాడు ఎస్సై షేక్‌ రజియా సుల్తానాను కూడా వీఆర్‌కు పంపించినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాకు చెందిన మరొక సీఐ కూడా రెండు మూడు రోజుల్లో వీఆర్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. జిల్లా పోలీసు శాఖలో జరుగుతున్న ఆకస్మాత్తు బదిలీలు క్షేత్రస్థాయిలో తీవ్రమైన చర్చ సాగుతోంది.

ఒంగోలు టౌన్‌: క్యాన్సర్‌ వ్యాధి లక్షణాలను తొలిదశలో గుర్తించి సరైన వైద్య సహాయం పొందితే వ్యాఽధిని పూర్తిగా నయం అవుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ర్యాలీ ప్రారంభించారు. దీర్ఘకాలిక అల్సర్‌, పొగాకు, మద్యం సేవించే వారిలో నోటిలో తెల్లపొక్కులు, ఎర్రపొక్కులు వంటి లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్‌గా అనుమానించి వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రొమ్ములో గడ్డలు, కొన్ని రకాల వాపులు రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలుగా అనుమానించాలని చెప్పారు. సీ్త్రలకు దీర్ఘకాలికంగా తెల్లబట్ట, రక్త స్రావం, గడ్డలు ఉండడం వంటివి సర్వికల్‌ క్యాన్సర్‌ లక్షణాలు కావచ్చన్నారు. క్యాన్సర్‌ వ్యాధికి ఔషధాలు ఎంతగా పనిచేస్తాయో మానసిక ధైర్యం కూడా అంతే పనిచేస్తుందని, అనవసర ఆందోళలు పెట్టుకోకుండా ధైర్యంగా చికిత్స చేయించుకోవాలని సూచించారు. జిల్లా మాస్‌ మీడియా అధికారి బి.నరసింహారావు, వైద్యాధికారులు అనిల్‌, అంజిరెడ్డి, రాజేష్‌ పాల్గొన్నారు.

రూరల్‌ సీఐగా శేషగిరిరావు 1
1/1

రూరల్‌ సీఐగా శేషగిరిరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement