గురువారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 5 2026 7:18 AM | Updated on Feb 5 2026 7:18 AM

గురువారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

గురువారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

గురువారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 – 8లో.. గుడి బడి తేడా లేకుండా మద్యం విక్రయాలు .. తూర్పు వీరాయపాలెంలో 14 బెల్ట్‌ షాపులు..

న్యూస్‌రీల్‌

కూటమికి కిక్కు...జనం జేబుకు చిల్లు మద్యం దోపిడీకి పచ్చ సిగ్నల్‌ రూ.10 అదనంగా అమ్ముకోవచ్చని ప్రభుత్వ ఉత్తర్వులతో రెచ్చిపోతున్న తమ్ముళ్లు ఉత్తర్వులు రాకముందు నుంచే అదనపు దోపిడీ బెల్ట్‌ షాపుల్లో ఎల్లో ట్యాక్స్‌ అదనం పేదల జేబులు గుల్ల చేస్తున్న పచ్చమూకలు ఉమ్మడి జిల్లాలో 232 లైసెన్స్‌ దుకాణాలు కీలక టీడీపీ నేతల కనుసన్నల్లో ఊరూరా బెల్ట్‌ షాపులు జిల్లాలో 3 వేలకు పైగా బెల్ట్‌ షాపులు మాముళ్ల మత్తులో జోగుతున్న ఎకై ్సజ్‌ అధికారులు

కల్యాణ మండపాల తరహాలో అలంకరించిన దాబాలు...

జిల్లాలో మద్యం దుకాణాల జాతర కొనసాగుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతల కబంధ హస్తాల్లోనే మద్యం దందా సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో అధికారికంగా 232 దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేస్తే అనధికారికంగా కీలక నేత కనుసన్నల్లో వేలాది బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. మందుబాబులతో పీకలదాకా తాగించి రెండు చేతులా సంపాదిస్తూ జేబులు నింపుకుంటున్నారు. లైసెన్స్‌ పొందిన దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బెల్టు దుకాణాల్లో ఇష్టం వచ్చిన రీతిలో దోచేస్తున్నారు. మద్యం అధిక ధరలపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చేసిన ప్రకటన అంతులేని మద్యం దందా సాగుతోందన్న ఆరోపణలకు బలం చేకూరుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు వెలిశాయి. గుడి బడి తేడా లేకుండా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి బహిరంగంగా మద్యం విక్రయిస్తుండడంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. దేవాలయాలకు వచ్చిపోయే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నా అధికారులకు పట్టడంలేదు. అఽధికార టీడీపీ నాయకులుగా ఏమాత్రం పాపభీతి లేకుండా దేవాలయాల వద్దే మద్యం విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ గ్రామంలో కందుకూరు రోడ్డు సెంటర్లో ఉన్న జాలమ్మతల్లి దేవాలయం ఎదురుగా లైసెన్స్‌ మద్యం దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అదే దేవాలయం సమీపంలో బెల్ట్‌ షాపు కూడా ఉంది. ఒంగోలు మండలంలోని అనేక గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కీలక నాయకుల ఆదేశాలతో ఎకై ్సజ్‌ అధికారులు తనిఖీలు చేయకుండా వదిలిపెట్టడం వల్లనే ఈ దుస్థితి నెలకొందని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో బెల్ట్‌ షాపులు మూడు బీర్లు, ఆరు లిక్కర్‌ బాటిళ్లుగా యమజోరుగా కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శి మండలంలోని తూర్పు వీరాయపాలెం గ్రామంలో ఏకంగా 14 బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సుమారు రెండున్నర వేల జనాభా కూడా లేని ఈ గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో షాపులు పెట్టి మద్యం విక్రయిస్తున్నా ఎకై ్సజ్‌ అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఒంగోలు మండలంలోని కరవది, గుండాయపాలెం, ఉలిచి, దేవరంపాడు గ్రామాల్లో కూడా అధిక సంఖ్యలో బెల్ట షాపులు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గుండాయపాలెం గ్రామంలోని బెల్ట్‌ షాపుల్లో నగరంలోని లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాని కంటే అఽధికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఎకై ్సజ్‌ శాఖలో పనిచేసే ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. ఒంగోలులోని ఊరచెరువు రాత్రయితే చాలు మందుబాబులతో దర్శనమిస్తుంది. ఇక్కడ బహిరంగంగా మద్యం సేవిస్తున్నా అటు పోలీసులకు, ఇటు ఎకై ్సజ్‌ అధికారులకు పట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాబా కల్చర్‌ విస్తరించింది. రాత్రయితే చాలు దాబాల హడావుడి మొదలౌతుంది. కల్యాణ మండపాల తరహాలో రంగురంగుల విద్యుత్‌ దీపాలతో దాబాలను అలంకరించిన దాబాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. తరుచూ ఈ దాబాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల యర్రగొండపాలెంలోని మార్కాపురం రోడ్డులో ఉన్న ఒక దాబాలో పీకలదాకా మద్యం సేవించిన మందుబాబులు మాటామాటా పెరిగి రెచ్చిపోయి కొట్టుకున్నట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాజీ చేసి పంపించినట్లు తెలిసింది. ఇందుకు గాను మందుబాబులు, దాబా నిర్వాహకుల నుంచి పోలీసులకు బాగానే ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మకై ్క సామాన్యుల చెమటను దోచుకుంటున్నారని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా సరే పాలకులకు చీమకుట్టినట్టయినా లేదు. సొంతంగా సంపదను సృష్టించుకోడానికి తెగబడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement