పాకల బీచ్ ఫెస్టివల్‌కు ప్రత్యేక ఏర్పాట్లు
● ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
సింగరాయకొండ: పాకల బీచ్ ఫెస్టివల్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో బేస్ ఫెస్టివల్ నేపథ్యంలో ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫెస్టివల్‌కు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ద్విచక్ర వాహనాలకు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు మద్యం తాగి బీచ్ వద్దకు రావద్దని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా క్రేన్‌లు, టోయింగ్ వాహనాలు సిద్ధంగా ఉంచుతామన్నారు. బీచ్ వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయటంతో పాటు ప్రజలకు ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీచ్ ప్రాంతంలో ప్రత్యేకంగా డ్రోన్‌లు ఎగరవేసి అనుమానితులను గుర్తిస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు సకాలంలో స్పందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫెస్టివల్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఫెస్టివల్‌కు వచ్చే రోడ్లను పరిశీలించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సీఐ సీహెచ్ హజరత్తయ్య, రామాయపట్నం మైరెన్ సీఐ శివన్నారాయణ, ఎస్సైలు బి.మహేంద్ర, నాగమల్లేశ్వరరావు, బి.మహేంద్ర పాల్గొన్నారు.


