ఉత్సవాల ఏర్పాట్లపై జేసీ ఆగ్రహం
త్రిపురాంతకం: త్రిపురాంతక క్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాల ఏర్పాట్ల తీరుపై జేసీ పులి శ్రీనివాసులు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తి చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. క్యూలైన్లు, సాగర్ స్నాన ఘట్టాలను పరిశీలించారు. మెట్ల మార్గాన్ని నీటితో శుభ్రం చేయించాలని చెప్పారు. ప్రొటోకాల్ ఉన్నవారిని మాత్రమే వీఐపీలుగా పరిగణించాలని స్పష్టం చేశారు. మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు, వినుకొండ డిపోల నుంచి ఇరవై ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరూ ఐడీ కార్డులతో విధులకు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ, ఎన్‌ఎస్పీ ఈఈ విజయలక్ష్మి, తహసీల్దార్ భాస్కర్, ఈఓ అనిల్‌కుమార్, సీఐ అసాన్, ఎస్సై శివబసవరాజు తదితరులు పాల్గొన్నారు.
యుద్ధప్రాతిపదికన పనులు
పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం


