కారుణ్య నియామకంలో 8 మందికి ఉద్యోగాలు
ఒంగోలు సిటీ: జిల్లా పరిషత్ యాజమాన్యం పరిధిలో పనిచేస్తూ మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా 8 మందికి ఆఫీస్ సబార్డినేట్‌లుగా జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ నియామక ఉత్తర్వులను అందజేశారు. మండల ప్రజా పరిషత్, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో నియమించారు. ఒంటేరు బాల సుబ్రహ్మణ్యం దొనకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలకు, ముద్రగడ దివ్యాంజలికి టంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో, షేక్ రజియా బేస్తవారిపేట మండల పరిషత్ కార్యాలయంలో, వలేటి దిలీప్‌కుమార్‌ను హనుమంతునిపాడు మండల పరిషత్ కార్యాలయంలో, కొంగలేటి దిలీప్‌కుమార్ ఆమనిగుడిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు, దేవండ్ల మహాలక్ష్మి కనిగిరి మండల పరిషత్ కార్యాలయంలో, అద్దంకి లక్ష్మిశశికళను వైదేన జెడ్పీ ఉన్నత పాఠశాలకు, బూచిరాజు నాగరాజు సంతనూతలపాడు మండల పరిషత్ కార్యాలయంలో నియమిస్తూ జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో సీఈఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


