ఆలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఆలయంలో చోరీ

Feb 9 2026 8:11 AM | Updated on Feb 9 2026 8:11 AM

ఆలయంలో చోరీ

ఆలయంలో చోరీ

అ‘పూర్వ’ కలయిక

కనిగిరిరూరల్‌: మండలంలోని నేలటూరి గొల్లపల్లి కాటంరాజు గంగమ్మ తల్లి గుడిలో ఆదివారం చోరీ జరిగింది. దేవస్థాన కమిటీ సభ్యుల వివరాల మేరకు..గుర్తు తెలియని దుండగులు తాళం పగులకొట్టి గుడిలోకి ప్రవేశించి అమ్మవారి వెండి కళ్లు రాగి గంటలతో పాటు హుండీ పగులకొట్టి అందులోని సుమారు రూ 20 వేల నగదు అపహరించినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిటీ సభ్యుడు పి.మధు తెలిపారు.

కనిగిరిరూరల్‌:

నిగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 1980–82 బ్యాచ్‌ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 46 ఏళ్ల తర్వాత స్నేహితులంతా ఒకచోట కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఎక్కడెక్కడో వివిధ హోదాల్లో, వ్యాపార, విద్యా రంగాల్లో స్థిరపడిన వారంతా దాదాపు 150 మంది ఒకచోట చేశారు. కార్య నిర్వాహకులు మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌, బొగ్గరపు సుందరరాజ, కేవీఎన్‌రాజు, వసంతకుమారి, పీవీఎస్‌ మురళీధర్‌, కేవీ రమణారెడ్డి, అబ్దుల్‌ ఖాదర్‌, బీవీ నారాయణ, కొప్పోలు ప్రభాకర్‌, భారతీ, జయరామిరెడ్డి, గోపి కిషోర్‌, జీవి లక్ష్మణ్‌ కుమార్‌, బచ్చలి భాస్కర్‌, ఒమేగా రామిరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, ఉషా, పద్మా, రత్నాకర్‌రెడ్డి, మైమున్నీసా, వి.భక్తవత్సలం పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు. ఆనాటి అధ్యాపకులు ఓబయ్య, జాకబ్‌లను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. వారు తమ జీవిత అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకొని మనసారా నవ్వుకున్నారు. పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు.అనంతరం పూర్వ విద్యార్థుల కమిటీ కళాశాల అభివృద్ధికి తమ వంతు ఆర్థికసాయాన్ని ప్రకటించారు. భవిష్యత్‌లో సేవాహిత, సహాయ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రస్తుత ప్రిన్సిపాల్‌, పాఠశాల హెచ్‌ఎం రమణారెడ్డి, హెచ్‌ఎంలు జి.సంజివీ, పల్లా కోటిరత్నం, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement