రాష్ట్రంలో అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచక పాలన

Feb 2 2026 7:19 AM | Updated on Feb 2 2026 7:19 AM

రాష్ట

రాష్ట్రంలో అరాచక పాలన

అంబటి రాంబాబు, జోగి రమేష్‌, విడదల రజనీలపై దాడిని ఖండించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు
కాపులు, బీసీలే టార్గెట్‌గా దాడులు

పక్కా ప్రణాళికతోనే దాడులు

పోలీసులు చూస్తుండగానే పక్కా ప్రణాళికతో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్లపై టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఇది ప్రజాస్వామ్య పాలనా లేక అటవిక పాలనా ? రాష్ట్రంలో మాజీ మంత్రులకే రక్షణ లేని పరిస్థితి నెలకొంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని హింసకు కేరాఫ్‌గా మార్చారు. తిరుమల లడ్డు విషయంలో కూటమి నేతలు చేసిన దుష్పచారం ప్రజలకు తెలిసిపోయింది. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం, అరెస్ట్‌కు టీడీపీ పాల్పడింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికారం శాశ్వతం కాదని, టీడీపీ దుర్మార్గ పాలన ఎల్లకాలం సాగదు.

– దద్దాల నారాయణ యాదవ్‌, వైఎస్సార్‌ సీపీ కనిగిరి ఇన్‌చార్జి

జోగి రమేష్‌ ఇంటిపై దాడి అమానుషం

మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంపై టీడీిపీ రౌడీ మూకల దాడి అమానుషం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. వ్యక్తిగత దాడులకు పాల్పడటం, ఇళ్లపై పడి విధ్వంసం సృష్టించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడులు పెరిగిపోయాయి. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే.

– డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌, వైఎస్సార్‌ సీపీ అద్దంకి ఇన్‌చార్జి

ఇది నియంతృత్వ పాలన

వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌, విడదల రజనిపై తెలుగుదేశం పార్టీ మూకలు దాడి చేయడం హేయమైన చర్య. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ఏపీ జంగిల్‌రాజ్‌ అయింది. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారు. నియంతృత్వ పాలనకు చంద్రబాబు తెరతీశారు. వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేసి తగలబెట్టడం దారుణం. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నారు. మాజీ మంత్రులకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? భవిష్యత్‌లో ఇటువంటి దాడులకు చంద్రబాబు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు.

– బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, వైఎస్సార్‌ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ , మాజీ ఎమ్మెల్యే

కాపులు, బీసీ నేతలపై దాడులు దారుణం

కాపు నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీసీ నాయకులైన మాజీ మంత్రులు జోగి రమేష్‌, విడదల రజని వంటి వైఎస్సార్‌ సీపీ నాయకులు, వంగవీటి మోహన్‌రంగా అభిమానులను టార్గెట్‌గా చేసి దాడులు చేయిస్తున్నారు. హత్యాయత్నం చేసే కుట్రలో భాగంగా ఇంటిపై దాడి చేసి ఇంట్లో చొరబడి విచక్షణా రహితంగా ఫర్నిచర్‌ ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డుపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎంక్వయిరీలో ఉన్న నిజాలు మాట్లాడితే దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అబద్ధాలు నిజాలు చేయాలని ఫ్లెక్సీలు వేస్తే వాటిని తీయాలని చెప్పిన అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా కర్రలు, రాడ్‌లు పెట్రోల్‌ బాంబులతో తాలిబన్లలా దాడులు చేయడం సమంజసం కాదు. దాడుల్లో పాల్గొన్న టీడీపీ గూండాలను పోలీసులు అరెస్ట్‌ చేసి చర్యలు తీసుకోవాలి.

– డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే

పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో టీడీపీ నేతల అసత్య ప్రచారాలను ఖండించిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌, విడదల రజనిలపై టీడీపీ అల్లరి మూకలు దాడులు చేయడం, ఇళ్లను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్‌ సీపీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, కాపులు, బీసీలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడులు చేయడం దుర్మార్గ చర్య

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఉందా లేదా అనిపిస్తోంది. రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనల తీరు గమనిస్తే ప్రభుత్వాన్ని చూసి ప్రజలు తల దించుకుంటున్నారు. ఎమ్మెల్యేగా పనిచేస్తున్నవారు, ముఖ్య స్థానాల్లో, పదవుల్లో, శాసనకర్తలుగా ఉన్నవారు ప్రతిపక్షనేతల ఇళ్లకు వెళ్లి దాడులు చేయడం ఎప్పుడూ చూడలేదు. ఇప్పటికై నా దాడులను మానకొని మంచిపాలన అందించాలి.

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లపై టీడీపీ మూకలు జరిపిన దాడులు అత్యంత హేయమైన చర్య. పోలీసులు చూస్తుండగానే పక్కా ప్రణాళిక ప్రకారం టీడీపీ మూకలు వైఎస్సార్‌ సీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలో శాంతి భధ్రతలు ఉన్నాయా.. లేదా అనిపిస్తోంది. మాజీ మంత్రులకే రక్షణ లేని పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఇలా దాడులకు దిగడం, విధ్వంసం సృష్టించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.

– జంకె వెంకటరెడ్డి, నెల్లూరు పార్లమెంట్‌ వైఎస్సార్‌ సీపీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే

ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదు

ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మంచి పద్ధతికాదు. తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఫ్లెక్సీ రాజకీయాలను మానుకోవాలి. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన తిరుమల వేంకటేశ్వరస్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి పెద్దలు చెడు ప్రచారం చేశారు. దీనిపై వైఎస్సార్‌ సీపీ నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా సిట్‌ను ఏర్పాటు చేసింది. వారు దర్యాప్తు జరిపి స్వామివారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేశారు. కూటమి నేతలు భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా ఇంకా లడ్డూ ప్రసాదంపై ఫ్లెక్సీల రాజకీయం చేయడం తగదు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేయడం, ఆయన ఇల్లు తగలబెట్టడం చూస్తుంటే రాష్ట్రంలో పాలన ఎటుపోతుందో అర్థంకావడం లేదు. ఎల్లకాలం చీకటి ఉండదు. మంచిరోజులు వస్తాయి. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్య పడవద్దు.

– అన్నా రాంబాబు, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే

– కేపీ నాగార్జునరెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే

రాష్ట్రంలో అరాచక పాలన1
1/6

రాష్ట్రంలో అరాచక పాలన

రాష్ట్రంలో అరాచక పాలన2
2/6

రాష్ట్రంలో అరాచక పాలన

రాష్ట్రంలో అరాచక పాలన3
3/6

రాష్ట్రంలో అరాచక పాలన

రాష్ట్రంలో అరాచక పాలన4
4/6

రాష్ట్రంలో అరాచక పాలన

రాష్ట్రంలో అరాచక పాలన5
5/6

రాష్ట్రంలో అరాచక పాలన

రాష్ట్రంలో అరాచక పాలన6
6/6

రాష్ట్రంలో అరాచక పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement