కుమార్తె డీఎస్పీ | - | Sakshi
Sakshi News home page

కుమార్తె డీఎస్పీ

Feb 1 2026 3:09 AM | Updated on Feb 1 2026 3:09 AM

కుమార

కుమార్తె డీఎస్పీ

తండ్రి హెడ్‌ కానిస్టేబుల్‌..

తండ్రి హెడ్‌ కానిస్టేబుల్‌..

ఒంగోలు టౌన్‌: ప్రతిష్టాత్మక గ్రూప్‌–1 పరీక్షల్లో ఒంగోలు యువతి సత్తా చాటింది. తండ్రి హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంటే కుమార్తె డీఎస్పీగా ఎంపికై ఔరా..అనిపించింది. ఒంగోలు ఏఆర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చెరుకూరి హుసేన్‌, నూర్జహాన్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి రిజ్వాన్‌ బీ టెక్‌ చదువుతున్నాడు. కుమార్తె రిజ్వానా గ్రూప్‌–1 పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి డీఎస్పీగా ఎంపికై ంది. రిజ్వానా ఒంగోలులోనే విద్యాభ్యాసం చేసింది. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విజ్ఞాన భారతి కాన్సెప్ట్‌ స్కూల్లో చదువుకుంది. ఒంగోలు చైతన్యలో ఇంటర్‌ చదివిన రిజ్వానా హైదరాబాద్‌లోని నోబుల్‌ డిగ్రీ కాలేజీలో హెచ్‌పీజీ డిగ్రీ చదివింది. ప్రస్తుతం విజన్‌ కోచింగ్‌ సెంటర్‌లో సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటోంది. రిజ్వానా తొలి నుంచి చదువుతో పాటు అన్నింటా అగ్రస్థానంలో నిలిచింది. పదో తరగతిలో 10కు 10 జీపీఏ సాధించింది. ఇంటర్లోనూ ఏ గ్రేడ్‌ సాధించింది. తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌–1లో ఉద్యోగం సాధించి ప్రశంసలు పొందింది. సివిల్స్‌ సాధించడమే తన ఏకై క లక్ష్యమని రిజ్వానా చెబుతోంది. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ డీఎస్పీ ఉద్యోగం సాధించిన రిజ్వానా జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టను పెంచిందని ఎస్పీ హర్షవర్థన్‌రాజు అభినందనలు తెలిపారు.

ఎంపీడీఓ నుంచి ట్రెజరీ ఆఫీసర్‌గా..

తాళ్లూరు: మండలంలోని తూర్పుగంగవరం గ్రామానికి చెందిన వల్లపనేని జ్యోతి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి విడుదల చేసిన గ్రూప్‌–1 ఫలితాల్లో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌గా సత్తా చాటారు. ప్రస్తుతం ఆమె మద్దిపాడు ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. జ్యోతి మండలంలోని నాగంబొట్లపాలెం సొసైటీ అధ్యక్షుడు వల్లపనేని సుబ్బయ్య కుమార్తె. గ్రామ ప్రజలు, మండల వాసులు ఆమెను అభినందించారు.

కుమార్తె డీఎస్పీ1
1/1

కుమార్తె డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement