షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
మార్కాపురం: తర్లుపాడు మండలంలోని కేతగుడిపి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామంలో నివసిస్తున్న వి.రమణకు చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు 2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. ఇంట్లోని గృహోపకరణాలు, దుస్తులు, నిత్యావసర సరుకులు మంటల్లో కాలిపోయాయని బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చింది. బాఽధిత కుటుంబం వద్దకు సచివాలయం సిబ్బంది చేరుకుని పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సుంకేశుల గ్రామంలో గడ్డివామి దగ్ధం...
పెద్దారవీడు మండలంలోని సుంకేశుల గ్రామంలో రైతు అనంతయ్యకు చెందిన గడ్డివామి శుక్రవారం దగ్ధమైంది. గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చి పడేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న మార్కాపురం ఫైర్ ఆఫీసరు రామకృష్ణ తన సిబ్బందితో వెళ్లి మంటలను ఆర్పారు. సుమారు 30 వేల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు.
రూ.2 లక్షల ఆస్తి నష్టం


