కిడ్నాపర్లపై చర్యలేవి? | - | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్లపై చర్యలేవి?

Feb 5 2026 7:20 AM | Updated on Feb 5 2026 7:20 AM

కిడ్న

కిడ్నాపర్లపై చర్యలేవి?

కిడ్నాపర్లపై చర్యలేవి? జిల్లా స్థాయి క్విజ్‌లో టంగుటూరు విద్యార్థి ప్రతిభ

ఒంగోలు టౌన్‌: తిరుపతిలోని ఎంబీ యూనివర్శిటీలో అక్రమాలను ప్రశ్నించిన విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్వి వీరాస్వామి డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. బుధవారం నగరంలోని రంగరాయుడు చెరువు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంబీ ఈ సందర్బంగా వీరాస్వామి మాట్లాడుతూ... ఎంబీ యూనివర్శిటీలో అక్రమాలను ఉన్నత విద్యా మండలి దృష్టికి తీసుకెళ్లడాన్ని జీర్ణించుకోలేక ఆ సంస్థ యాజమాన్యం విద్యార్థి సంఘ నాయకులకు కిడ్నాప్‌ చేసిందని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

టంగుటూరు: జిల్లా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 31వ తేదీన ఒంగోలులో నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్‌ పోటీల్లో స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఆయుధం సన్నీకుమార్‌ ద్వితీయస్థానం సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

కిడ్నాపర్లపై చర్యలేవి? 
1
1/1

కిడ్నాపర్లపై చర్యలేవి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement