నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక
మార్కాపురం టౌన్: మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించనున్నట్లు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని కోరారు.
గుడ్లూరు: ఇండో సోలార్ కంపెనీ పైపులు దగ్ధమైన ఘటన ఆదివారం గుడ్లూరు మండలంలోని చేవూరు చెరువు వద్ద జరిగింది. 150 మీటర్ల పొడవైన పైపులు కాలిపోయాయి. వాటి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఆ మేరకు గుడ్లూరు పోలీస్‌స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు పైపులను తగులబెట్టారని ఫిర్యాదు చేశారు. కందుకూరు డీఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, సీఐ నరేశ్ కుమార్, గుడ్లూరు ఎస్సై ఐవీ వెంకట్రావు చేవూరు చెరువు వద్దకు చేరుకొని విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి.వెంకట్రావు తెలిపారు.
పెరిగిన భక్తుల రద్దీ
● శ్రీశైలానికి భారీగా తరలివెళుతున్న యాత్రికులు
పెద్దదోర్నాల: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధి గాంచిన శ్రీశైల పుణ్యక్షేత్రానికి భారీగా తరలివచ్చే భక్తులతో ఆదివారం మండల కేంద్రం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భారీగా తరలి రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం సెలవు కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు, గంటూరు, కర్నూలు ప్రాంతాల నుంచి మాలలు ధరించిన శివస్వాములు శ్రీశైలానికి అధికంగా తరలివచ్చారు. దీంతో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిశాయి. దీనికి తోడు పర్యావరణ పరిరక్షణ రుసుం వసూలు చేయడంలో అంతరాయంతో శ్రీశైలం రహదారిలోని గణపతి చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్‌కు కొంతమేర అంతరాయం ఏర్పడింది.
ఒంగోలు టౌన్: బైక్ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నగరంలోని చంద్రయ్య కాలనీకి చెందిన వల్లెపు దుర్గా ప్రసాద్, మారుతీనగర్‌కు చెందిన ఇట్లా సందీప్ స్నేహితులు. ఆదివారం ఇద్దరు స్నేహితులు కలిసి తిరిగారు. సందీప్‌ను ఇంటి వద్ద వదిలిపెట్టేందుకు బయలుదేరారు. పాత వర్మ హోటల్ వద్దకు రాగానే వేగంగా వచ్చిన మోటారు బైకు ఢీకొట్టింది. దీంతో సందీప్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దుర్గా ప్రసాద్‌కు స్వల్ప గాయలయ్యాయి. ఈ మేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
టంగుటూరు:
ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలోఅదుపుతప్పి క్రేన్ బోల్తా పడింది. ఈ సంఘటన మండలంలోని మల్లవరప్పాడు సమీపంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు..టంగుటూరు మండలం కందులూరు–మల్లవరపాడు గ్రామం దారిలో మల్లవరప్పాడు గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై మద్యం సేవించి వ్యక్తి వేగంగా వస్తుండగా ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో పక్కనే ఉన్న వంట కాలవలోకి క్రేన్ బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక
నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక


