సింగరాయకొండలో చోరీ
● రూ.3.50 లక్షల విలువైన సొత్తు
అపహరణ
సింగరాయకొండ:
మండల కేంద్రమైన శ్రీరాంనగర్ వడ్డెర కాలనీలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పంచాయతీ కార్మికుడు తన్నీరు శివనాగరాజు నివాసంలో దుండగులు రూ.3.50 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు వెండి సామగ్రి చోరీ చేశారు. బాధితుడు శివనాగరాజు కథనం ప్రకారం.. శివనాగరాజు బంధువులు బుంగబావి సెంటర్‌లో నివాసముంటున్నారు. వారికి అనారోగ్యంగా ఉండటంతో చూసేందుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయం 6 గంటలకు రాగా కిటికీ తలుపులు తీసి ఉన్నాయని, లోపలికి వెళ్లి చూడగా ఇంటి నిర్మాణానికి బీరువాలో ఉంచిన రూ.1.50 లక్షల నగదు, రూ.లక్ష విలువైన బంగారు ఆభరణాలు, రూ.లక్ష విలువైన వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.


