పోలీసు మీకోసం తాత్కాలికంగా రద్దు
ఒంగోలు టౌన్: జిల్లా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ద్విచక్ర వాహనానికి నిప్పు
జె.పంగులూరు: మండల పరిధిలోని బూదవాడ ధనలక్ష్మి కాలనీ సమీపంలోని చెరువు కట్టపై ఆదివారం దుండగలు బైకుకు నిప్పంటించారు. ప్రమాదంలో బైక్ పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళితే.. జలకర ప్రశాంత్‌కు చెందిన బైకును ఆదివారం చెరుకు కట్టపై ఉంచి స్నేహితుని ద్విచక్రవాహనంలో ఇంకొల్లు వెళ్లాడు. అక్కడ స్నేహితున్ని వైద్యునికి చూపిస్తుండగా బైక్ మంటల్లో కాలిపోతుందన్న విషయం తెలుసుకొని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని చేరుకున్నారు. అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది. బాధితుడు రేణింగవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ర్తు తెలియని వ్యక్తులు ఎవరో నిప్పంటించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
● బీటీఏ జిల్లా అధ్యక్షుడు ఆంథోని
మార్కాపురం టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం అన్యాయమని బహుజన టీచర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్ ఆంథోని అన్నారు. పట్టణంలోని బీటీఏ కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల హామీ ప్రకారం మెరుగైన పీఆర్‌పీ ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకూ పీఆర్‌సీ కమిటీ ఊసేలేదన్నారు. ఉద్యోగులకు ఆర్ధిక నష్టం జరగకుండా 30 శాతం ఐఆర్ ఇవ్వాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ బహుజన సిద్ధాంతాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తృతం చేయాలని, అన్నీ మండలాల్లో బీటీఏ శాఖలను ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథం నాగయ్య అధ్యక్షత వహించగా కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, ముసలయ్య, శ్రీనివాసులు, సజీవరాజు, దేవండ్ల బాలయ్య, చిన్న వెంగయ్య, ప్రదీప్, కొండలరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పోలీసు మీకోసం తాత్కాలికంగా రద్దు


