పాసుపుస్తకాల జారీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
కొండపి: పట్టాదారు పాసుపుస్తకాలు జారీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి అధికారులను హెచ్చరించారు. మండలంలోని ముప్పవరం పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి వీఆర్‌ఓలు, సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని కొన్ని గృహాలను సందర్శించి పాసుపుస్తకాల జారీలో ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాల కరెక్షన్ గురించి సమీక్షించి పొరపాట్లకు తావు లేకుండా పుస్తకాలను పంపిణీ చేయాలన్నారు. పాసు పుస్తకాలు తీసుకున్న లబ్ధిదారులు అధికారులకు ఎటువంటి రుసుం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. తొలుత కేజీ కండ్రిక గ్రామంలో సర్వే నంబర్ 60లోని 7 ఎకరాల స్థలాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టల్‌కు పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ ఎం.శివరామప్రసాద్, ఎంపీడీఓ రామాంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ రవిబాబు, ఆర్‌ఐ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఏఈ రవికుమార్, సర్వేయర్ రాజు, రెవెన్యూ, మండల పరిషత్ , ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వండి
● మహా శివరాత్రి రోజు భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలి
● దేవదాయ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులను ఆదేశించిన కలెక్టర్
ఒంగోలు సబర్బన్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్‌లోని వీసీ హాలు నుంచి దేవదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర జిల్లా అధికారులతో మంగళవారం రాత్రి వర్చువల్‌గా మాట్లాడారు. సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం కల్పించాలన్నారు. అసౌకర్యం లేకుండా శైవ క్షేత్రాల్లో దైవ దర్శనాలు కలిగేలా చూడాలన్నారు. ఈ నెల 15న మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో చేపట్టాల్సిన ఉత్సవ ఏర్పాట్లుపై దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఓబులేసు, దేవాదాయ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పాసుపుస్తకాల జారీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు


