అపుస్మా జిల్లా అధ్యక్షునిగా మలికార్జునరెడ్డి
మార్కాపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ (అపుస్మా) మార్కాపురం జిల్లా అధ్యక్షునిగా గొట్టం మలికార్జునరెడ్డిని ఎన్నుకున్నారు. స్థానిక కమలా స్కూల్‌లో ఆదివారం జిల్లా నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, కోశాధికారిగా ఏ వెంకటేశ్వరరెడ్డి, గౌరవ అధ్యక్షునిగా జే రత్నంబాబు, ఉపాధ్యక్షులుగా ఎస్ పిచ్చిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా కే రంగయ్య, కార్యవర్గ సభ్యులుగా పీ మణి చైతన్య, ఆర్ గుంటయ్య, యం సాలీగ్రాంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మాధవరావు, గౌరవ అధ్యక్షుడు బీ హనుమంతరావు, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి సుమారు 60 మంది ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు హాజరయ్యారు.
● 3.3 సెం.మీ అతి సూక్ష్మ
వరల్డ్ కప్ తయారీ
చీరాల: 2026 అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో చరిత్ర సృష్టించిన భారత్ జట్టుకు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన స్వర్ణకారుడు నక్కా వెంకటేష్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో 3.3 సెంటీమీటర్ల అతి సూక్ష్మమైన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ తయారు చేశారు. క్రికెట్‌లో ఇంగ్లాడ్‌ను ఓడించిన భారత్ యువ క్రికెటర్లకు దీనిని అంకితం చేశారు. ఈ కప్పు తయారీలో 0.500 మిల్లీగ్రాముల బంగారాన్ని, 2.900 మిల్లిగ్రాముల వెండిని ఉపయోగించి రెండు రోజులు పాటు శ్రమించి వరల్డ్‌కప్ తయారు చేసినట్లు ఆయన తెలిపారు.
అపుస్మా జిల్లా అధ్యక్షునిగా మలికార్జునరెడ్డి


