పోలీసు గ్రీవెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ
ఒంగోలు టౌన్: వరసగా రెండు వారాలు పోలీసు గ్రీవెన్స్ వాయిదా పడడంతో సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన 124 మంది బాధితులు ఫిర్యాదులు అందజేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసు అధికారులు వారి సమస్యలను, పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ రమణకుమార్, పీసీఆర్ సీఐ దుర్గాప్రసాద్, రూరల్ సీఐ శేషగిరిరావు, సంతనూతలపాడు సీఐ వెంకటరావు, కొండపి సీఐ సోమశేఖర్, ప్యానల్ అడ్వకేట్ బి.బాలాజీసింగ్, వేదిక ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు.


