ఏసీబీ వలలో మైన్స్‌ సర్వేయర్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో మైన్స్‌ సర్వేయర్‌

Feb 7 2026 2:58 PM | Updated on Feb 7 2026 2:58 PM

ఏసీబీ

ఏసీబీ వలలో మైన్స్‌ సర్వేయర్‌

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

ఒంగోలు సిటీ/మార్కాపురం/కనిగిరి రూరల్‌: ఒంగోలులోని గనులు, భూగర్భజలాల (మైన్స్‌ అండ్‌ జియాలజీ) శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న షేక్‌ అబ్దుల్‌ ఆసిఫ్‌ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు అందిన సమాచారం ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం స్థానిక మంగమూరు రోడ్డు వేద రెసిడెన్సీలోని కార్యాలయంలో సోదాలు చేపట్టిన ఏసీబీ బృందం ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించింది. ఆసిఫ్‌ది మార్కాపురం కాగా కనిగిరిలో వివాహం చేసుకుని ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఆయన గతంలో కడప, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పనిచేశారు. ఏడాదిగా ఒంగోలు డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. నెల్లూరులో పనిచేస్తుండగా ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి పక్కా సమాచారం అందిన నేపథ్యంలో నెల్లూరు ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఆసిఫ్‌ నివాసం విజయవాడలో ఉండటంతో అక్కడి స్వగృహంతో పాటు మార్కాపురం, కనిగిరి, నెల్లూరు, గుంటూరుల్లోని బంధువుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో అతని అక్రమ ఆస్తులకు సంబంధించి వివిధ డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అక్రమ ఆస్తుల్లో రెండు ఇళ్లు, ఒక ఇంటి స్థలం, 22 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.2,82,264 నగదు, సుమారు 620 గ్రాముల బంగారం, సుమారు 500 గ్రాముల వెండి, రూ.3,54,000 ల ప్రాంసరీనోట్లు, 16 చేతిగడియారాలు, ఒక మోటారు సైకిల్‌, విలువైన గృహోపకరణాలు ఉన్నట్లు తెలిపారు. ఇవికాక అసిఫ్‌ హెచ్‌డీఎఫ్‌సీ ఇన్సూరెన్స్‌లో రూ.15 లక్షలతో పాలసీలు తీసుకొన్నట్లు చెప్పారు. అలాగే టొయోటా హై రైడర్‌ కారు కొనడానికి రూ.20 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సోదాల్లో ఒక లాకర్‌ను గుర్తించారు. సోదాల అనంతరం సర్వేయర్‌ను అరెస్ట్‌ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నట్లు చెప్పారు.

ఏసీబీ వలలో మైన్స్‌ సర్వేయర్‌1
1/1

ఏసీబీ వలలో మైన్స్‌ సర్వేయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement