కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటా | - | Sakshi
Sakshi News home page

కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటా

Feb 2 2026 7:19 AM | Updated on Feb 2 2026 7:19 AM

కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటా

కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటా

వార్డు కమిటీలు చాలా ముఖ్యం పార్టీకి పనిచేసే వారినే ఎంచుకోవాలి దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ

దర్శి: కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటామని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో దర్శి మున్సిపాలిటీలోని వార్డుల వారీగా కమిటీల నియామకం సందర్భంగా పట్టణ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ వార్డు కమిటీల్లో మంచి సర్వీస్‌ చేసే వారిని, అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ అండగా ఉండే వారిని నియమిస్తే ఆ వార్డులో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ప్రధానంగా సోషల్‌ మీడియా నియామకాల్లో చదువుకుని మంచి అవగాహన ఉన్నవారిని నియమించాలని సూచించారు. మనం ఏం చేశామో ప్రజలకు చెప్పుకునేలా ఉండాలన్నారు. మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమంతో పాటు కార్యకర్తలకు పెద్ద పీట వేస్తారన్నారు. గతంలో పార్టీలకు అతీతంగా అందరికీ పథకాలు అందించాలనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌ పాలన కొనసాగిస్తే ప్రస్తుతం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు వైఎస్సార్‌ సీపీ వాళ్లకు ఎటువంటి పథకాలు ఇవ్వవద్దని చెప్పడం ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ఆయన స్వార్థం కోసం ఎన్ని అబద్దాలైనా చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ వెన్నపూస వెంకటరెడ్డి, మున్సిపల్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీరెడ్డి, విద్యార్థి విభాగం కోఆర్డినేటర్‌ దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, వార్డు కౌన్సిలర్‌లు మేడం మోహన్‌రెడ్డి, తుళ్లూరి బాబురావు, ఆవుల జ్యోతి శివారెడ్డి,జగన్నాధం మోహన్‌బాబు, జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్‌, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొల్లా ఉదయ్‌భాస్కర్‌, వైస్‌ ఎంపీపీ సోముదుర్గారెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ షేక్‌ షకీలా అమీన్‌ భాషా, వార్డు ఇన్‌చార్జ్‌లు పాణెం మజ్ఞువలి, అన్నవరపు రవి, కొండలు, అంకాల నాగయ్య, నాయకులు దామెర్ల చంద్రం, వెన్నపూస పేరిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కర్ణా రమణారెడ్డి, దామెర్ల రామ్మోహన్‌, మేడగం బాలకృష్ణారెడ్డి, కృష్ణ, కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, గంజి వెంకటేశ్వరరెడ్డి, పానుగంటి మోహన్‌రావు, బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement