● జేసీ శ్రీనివాసులు
మార్కాపురం: కందులు, శనగల కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు సూచించారు. మార్కాపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందులు, శనగల కొనుగోలు కేంద్రాలను ఆయన ఏడీఏ బాలాజీ నాయక్‌తో కలిసి పరిశీలించి మాట్లాడుతూ దళారులకు అమ్మి రైతులు నష్టపోవద్దని తెలిపారు. కందుల్లో 12 శాతం, శనగలు 14 శాతం తేమ ఉంటే మంచి ధర లభిస్తుందని ఏడీఏ బాలాజీ నాయక్ తెలిపారు. అనంతరం జేసీ రికార్డులను, రైతుల నుంచి కొనుగోలు చేసిన కందులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మార్కాపురం, పెద్దారవీడు ఏఓలు బుజ్జీబాయి, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.


