పెద్దదోర్నాల: రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ వృద్ధుడిని ఢీకొన్న మోటారుసైకిల్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న గిరిజన యువకుడు పులిచర్ల బయ్యన్న (20) మృతి చెందగా రోడ్డుపై నడిచి వెళ్తున్న మద్దయ్యతో పాటు బైక్‌పై ఉన్న సానికొమ్ము కార్తీక్‌రెడ్డి, ఉడుతల భరత్‌లు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక యువకులు మోసుకుంటూ వైద్యశాలకు తరలించగా వైద్యశాలలో చికిత్స పొందుతూ పులిచర్ల బయ్యన్న మృతి చెందాడు. గాయపడిన వృద్ధుడు మద్దయ్య, కార్తీక్‌రెడ్డిలను నరసరావుపేటకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


