అన్నీ ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

అన్నీ ఏర్పాట్లు పూర్తి

Mar 16 2026 7:40 AM | Updated on Mar 16 2026 7:40 AM

సోమవారం నుంచి జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 87 పరీక్ష కేంద్రాల్లో 14,596 మంది పరీక్షలు రాస్తున్నారు. గదుల్లో వారికి అన్నీ ఏర్పాట్లు చేశాం. తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్‌ సెంటర్లు మూసివేయిస్తున్నాం. విద్యార్థులు ప్రశాంతంగా టెన్షన్‌ లేకుండా పరీక్షలు రాయాలి. కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు చేపడతాం.

– మామిళ్లపల్లి శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ డీఈఓ మార్కాపురం జిల్లా

144 సెక్షన్‌ అమలు

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నాం. అన్నీ జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలి. పరీక్ష కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, సిబ్బంది తప్ప బయట వ్యక్తులెవరూ ఉండకూడదు. సమస్యాత్మక కేంద్రాలపై కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూముల వద్ద భద్రత కల్పిస్తున్నాం. ఎటువంటి అవకతవకలు, మాల్‌ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా సిబ్బంది విధులు నిర్వర్తించాలి. మొబైల్‌, పెట్రోలింగ్‌ బృందాలను ఏర్పాటు చేశాం. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ కూడా కేంద్రాలను తనిఖీ చేస్తారు.

– హర్షవర్ధనరాజు, ఇన్‌చార్జి ఎస్‌పీ మార్కాపురం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement