ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పశువులకు గాలికుంటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సూచించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ఆమె ఆవిష్కరించారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆరు లక్షలకుపైగా పశువులకు ఈ వ్యాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


