● సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున
చీమకుర్తి రూరల్: వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున భరోసా ఇచ్చారు. చీమకుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. సోమవారం మండలంలోని తొర్రగుడిపాడు గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి పార్టీ సంస్థాగత కమిటీలపై సమావేశం నిర్వహించారు. ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, మేరుగు నాగార్జున మాట్లాడుతూ జగనన్న పిలుపు మేరకు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్పేలా చూడాలన్నారు. మనమంతా సమిష్టిగా కృషి చేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ చీమకుర్తి మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు యన్నం శేషురెడ్డి, నాయకుడు చీదర్ల శేషు, వైస్ ఎంపీపీ రావి లక్ష్మయ్య, జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి ఓబులరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటరావు, రైతు విభాగం మండల అధ్యక్షుడు నల్లూరి రామచంద్ర, యూత్ అధ్యక్షుడు సుడిదెల వెంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పొన్నపల్లి నాగేశ్వరరావు, నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు మక్కెన రాజేంద్ర, నాయకులు బొంతా సంతోష్, కూడలి మాలకొండయ్య శ్రీను, కొణికి సుబ్రహ్మణ్యం, నాగార్జున, వెంకటేశ్వర్లు, సుంకర హరికృష్ణ, ఆంద్రియ తదితరులు పాల్గొన్నారు.


