మోసానికి బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ | - | Sakshi
Sakshi News home page

మోసానికి బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌

Mar 10 2026 7:16 AM | Updated on Mar 10 2026 7:16 AM

మోసానికి బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌

కురిచేడు: అబద్ధపు హామీలతో ప్రజలను వంచించండం చంద్రబాబు నైజమని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. మండలంలోని పడమర నాయుడుపాలెం, ఆవులమంద గ్రామాల మధ్య కొండపై వెలసిన ప్రసన్నాంజనేయ సమేత బొల్లి కొండ్రాయి స్వామి వార్షికోత్సవ తిరునాళ్ల సందర్భంగా యాదవులు ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభపై జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పంటలకు సరైన మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం తప్ప ప్రజా పాలన లేదని విమర్శించారు. ప్రశ్నించే ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, కేసులకు భయపడే రోజులు పోయావని, అవినీతిని ప్రశ్నించే రోజులు వచ్చాయన్నారు. మన నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి అని, మాట ఇస్తే తప్పడని, మడమ తిప్పని నాయకుడి వెంట మేమున్నామని బడుగు, బలహీన వర్గాల వారి కోసం, రైతుల కోసం, మహిళల కోసం ఎన్నికల ముందు మాట ఇచ్చి వంద శాతం హామీలను నెరవేర్చిన ఏకై క ముఖ్యమంత్రి జగనన్న అని తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన ఒక్క హామీని సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే విమర్శించారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు. రేషన్‌ బియ్యం, భూ కబ్జా చేసి దోచుకుంటున్నారని, బినామీ పేర్లకు తక్కువ ధరకు భూములు అప్పగించి కొత్త రకం భూ దందాకు పాల్పడుతున్నారన్నారు. 2029 ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా, దర్శి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని హర్షధ్వానాల మధ్య కోరారు. అనంతరం యాదవలు బూచేపల్లిని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు యన్నాబత్తుల సుబ్బయ్య, జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు రాజయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్‌ కండె గంగయ్య యాదవ్‌, సర్పంచ్‌ మహేష్‌, నాయకులు బొమ్మనబోయిన చిన్న ఆంజనేయులు, బొమ్మినీడు చెంచయ్య, చిన్న ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడేది లేదు

బూటకపు హామీలతో బాబు నిలువునా మోసం

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి భయపడేది లేదు

పార్టీకి కార్యకర్తలకే కొండంత బలం

దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement