బల్లికురవ: గుర్తు తెలియని వాహనం ఢీకొని బైకు నుంచి కిందపడి ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి మేదరమెట్ల–నార్కేట్‌పల్లి నామ్ రహదారి మండలంలోని కొప్పరపాడు సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద జరిగింది. అందిన సమాచారం ప్రకారం..కొప్పరపాడు గ్రామానికి చెందిన పందిరి ఇజ్రాయేల్ (27) బైకుపై అత్తగారి ఊరైన వైదన పంచాయతీ చవిటి మాదిగపల్లెకు వెళ్తున్నాడు. ప్రమాదంలో బైకు నుంచి కిందపడి చెవుల నుంచి రక్తం రావడంతో వైద్యం అందేలోపు చనిపోయాడు. మృతుని తండ్రి అంకారావు ఫిర్యాదు మేరకు శనివారం ఎస్సై వై.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


