బల్లికురవ: పథకం ప్రకారం భార్యను పొలంలోకి తీసుకెళ్లి సాగర్ కాలువలోని నెట్టేసిన భర్తను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు సంతమాగులూరు సీఐ కె. వెంకటరావు, బల్లికురవ ఎస్సై వై. నాగరాజు తెలిపారు. మండలంలోని వల్లాపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి వీరాంజనేయులు భార్య గంగాభవాని (28) గత మంగళవారం సాయంత్రం సాగర్ అద్దంకి బ్రాంచ్ కాల్వ 33/0 కి ఎగువన హత్యతో కాల్వలోకి నెట్టిన విషయం విదితమే. భవాని సోదరుడు కొనిదెన శ్రీను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుతో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ,ఎస్సైలు వివరించారు.


