● డీఈఓ సీవీ రేణుక
ఒంగోలు సిటీ: విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ సీవీ రేణుక అన్నారు. ప్రకాశం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రాం జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం హైస్కూల్ టీచర్లకు బుధవారం ప్రకాశం భవన్‌లోని పీజీ ఆర్‌ఎస్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల నుంచి 150 మంది టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ సీవీ రేణుక మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి పాఠశాల ఉపాధ్యాయుడు కీలకమన్నారు. వివిధ రకాల పోస్టర్స్‌ను, శిక్షణ దీపికను విడుదల చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి చంద్రమౌలేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి టీ రమేష్, మాస్టర్ ట్రైనీలుగా పిచ్చిరెడ్డి, నివేదిత, అల్లూరయ్య, సంజీవరాజు, భాస్కర్ రెడ్డి, రాజగోపాల్ వ్యవహరించారు.


