తవ్వేసుకుందాం..! | - | Sakshi
Sakshi News home page

తవ్వేసుకుందాం..!

Mar 11 2026 7:23 AM | Updated on Mar 11 2026 7:23 AM

మీకింత..మాకింత

మీకింత..మాకింత

పెద్దారవీడు:

మండలంలో గ్రావెల్‌ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. అధికారం మాది, అక్రమాలు చేస్తాం..అడిగేదెవరు, అధికారులూ మ్మల్ని ఏం చేయలేరనే రీతిలో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. కూ బొంకూ లేకుండా యథేచ్చగా రేయింబవళ్లు మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. పొక్లెయిన్లతో కొండను పిండి చేసి నిత్యం వందలాది ట్రిప్పుల మట్టిని తరలించి జేబులు నింపుకుంటున్నారు.

టిప్పర్‌ రూ.5 వేల చొప్పున..

మండలంలో ఎస్‌ కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో కొండకు పైభాగాన రస్తాను ఏర్పాటు చేసి వందల సంఖ్యలో టిప్పర్ల మట్టిని తరలిస్తున్నారు. 10 రోజుల నుంచి టిప్పర్ల ద్వారా నిత్యం వందలాది ట్రిప్పులు దేవరాజుగట్టు గ్రామం సమీపంలో వేసిన వెంచర్ల ప్లాట్లకు మట్టిని తరలిస్తున్నారు. ఒక టిప్పర్‌ మట్టి రూ 5 వేలకు విక్రయిస్తున్నారు. అందులో టీడీపీ నియోజకవర్గ నాయకులకు రూ.2 వేలు ముట్టచెప్పి చెబుతున్నారు. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణం బెస్‌మట్టం కోసం ట్రాక్టర్‌తో మట్టి తోలుకుంటే వెంటనే మైనింగ్‌ అధికారులు ట్రాక్టర్‌ను సీజ్‌ చేస్తారు. అదే అధికార పార్టీ నాయకుల మద్దతుతో రేయింబవళ్లు అక్రమంగా వెంచర్లకు మట్టి తరలిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకునేదెవరు..?

కళ్ల ముందే ఇష్టం వచ్చినట్లు మట్టిని తరలిస్తుంటే గ్రామ్తులు ఇటీవల జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత దేవరాజుగట్టు గ్రామం సమీపంలో వెంచర్లు ఎక్కువగా వేయడంతో కొండ మట్టికి మంచి డిమాండ్‌ పెరిగింది. దీంతో ఎటువంటి అనుమతులు లేకుండా టన్నుల కొద్ది గ్రావెల్‌ మట్టిని యథేచ్చగా టీడీపీ నాయకులు ఇతర ప్రాంతాలకు తరలించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన లక్షల్లో ఆదాయానికి గండి పడుతోంది. భారీ స్థాయిలో కొండల తవ్వకాలు జరుగుతున్నా అడ్డుకునే నాథుడే కనిపించడం లేదు. యథేచ్చగా అక్రమంగా మట్టి తవ్వకాాలు జరుపుతున్నా సంబంధించిన అధికారులు నోరుమెదపకపోవడంలో మర్మమేంటో అర్థం కావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పంధించి గ్రావెల్‌ మట్టి అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు చేపట్టాలని, పచ్చని కొండలను రక్షించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

కొండ తవ్వి అక్రమంగా మట్టి తరలింపు

టీడీపీ నాయకుల అండతోఆక్రమంగా మట్టి తోలకం

టిప్పర్‌ రూ.5 వేల చొప్పున రియల్‌ వెంచర్ల యజమానులకు విక్రయం

వచ్చిన దాంట్లో టీడీపీ నియోజకవర్గ నాయకునికి సగం వాటా

గ్రామస్తులు ఫిర్యాదుచేసినా పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement