అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండానే రూ.20 వేలు ఇస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక మాటమార్చారు. అకాల వర్షాలు, తుఫాన్‌లతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు నేటికీ నష్ట పరిహారం విడుదల చేయలేదు. ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి.
– యూ జోసఫ్, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు, అన్నదాత సుఖీభవ పథకం ఒక ఏడాది ఇవ్వలేదు. ప్రస్తుతం ఇచ్చే పథకంలో కొర్రీలు పెట్టి లబ్ధిదారులను భారీగా తగ్గిస్తున్నారు. ప్రతి రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం పథకానికి దూరం చేయడం సమంజసం కాదు.
– ఆవుల శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్


