ఏకేయూలో కెమిస్ట్రీ, ఆక్వా కల్చర్‌ ల్యాబ్‌లు | - | Sakshi
Sakshi News home page

ఏకేయూలో కెమిస్ట్రీ, ఆక్వా కల్చర్‌ ల్యాబ్‌లు

Mar 14 2026 7:38 AM | Updated on Mar 14 2026 7:38 AM

ప్రయోగశాలలు ప్రారంభించిన వీసీ డీవీఆర్‌ మూర్తి, రిజిస్ట్రార్‌ హరిబాబు

ఒంగోలు సిటీ: ఒంగోలు ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కాలేజీలో కొత్త రసాయన శాస్త్రం, ఆక్వాకల్చర్‌ విభాగాల కోసం ఏర్పాటు చేసిన వైస్‌ చాన్సలర్‌ డీవీఆర్‌.మూర్తి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ డీవీఆర్‌ మూర్తి మాట్లాడుతూ ఈ ఆధునిక ప్రయోగశాల విద్యార్థులకు పరిశోధన కార్యకలాపాలు, నాణ్యమైన శాసీ్త్రయ శిక్షణ అందించడానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్త ప్రయోగశాలల ఏర్పాటుకు సహకరించిన అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌, హెడ్‌ అఫ్‌ ది డిపార్టుమెంట్‌ ప్రొఫెసర్‌ హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రయోగిక శిక్షణను మెరుగుపరచడం, శాసీ్త్రయ పరిశోధనలను ప్రోత్సహించడం, నైపుణ్యాధారిత విద్యను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ నిర్మలామణి మాట్లాడుతూ యూనివర్సిటీ కాలేజీలో నూతన ప్రయోగ శాల ఏర్పాటు చేయడం సంతోషకరమని, అలాగే మరికొన్ని ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement