శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026
ఇతని పేరు జూటూరి సిద్ధయ్య. అర్థవీడు మండలం చెర్లో దొనకొండ గ్రామం. ఇతనికి ఒకటిన్నర ఎకరా పొలం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం పలుమార్లు వ్యవసాయశాఖ అధికారులకు అర్జీ ఇచ్చాడు. కొత్తవి పెట్టుకునేందుకు అవకాశం లేదంటున్నారు. గతంలో హైదరాబాద్‌లో ప్త్రెవేట్ కంపెనీల్లో పనిచేసుకుంటూ జీవించాడు. ఆరోగ్య సమస్యలతో కొన్నేళ్ల క్రితం స్వగ్రామం వచ్చాడు. ఉన్న పొలంలో పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసుకుంటున్నాడు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ అన్నదాత సుఖీభవ పథకం ఇస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలవడం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం దారుణమని సిద్ధయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


