నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టండి

Mar 13 2026 7:35 AM | Updated on Mar 13 2026 7:35 AM

నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టండి

మార్కాపురం: వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టరేట్‌లో ఆర్‌డబ్ల్యూఎస్‌, మున్సిపల్‌ అధికారులతో నీటి సమస్యపై గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడెక్కడ నీటి సమస్యలు వచ్చే అవకాశం ఉందో ముందుగానే గుర్తించాలని, వాటి పరిష్కార మార్గాలను అన్వేషించాలని చెప్పారు. అవసరమైన చోట, పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ సురేష్‌బాబు, డీపీహెచ్‌ఈఓ శ్రీనివాసరావు, గిద్దలూరు మున్సిపల్‌ కమిషనర్‌ రమణ, పలువురు ఏఈలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement